Thursday, October 30, 2008

ఏదీ లేదు

మదిలోని మంచితనానికి మరణం లేదు,
ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు,
అనుక్షణం నిన్ను తలచే మనస్సుకు అలసట లేదు,
నిన్ను తోడుగా పొందని నా జీవిత పయనం లేదు,
నీవు నేనుగా లేని నా ప్రపంచమే లేదు

వినయ్

Wednesday, October 29, 2008

ఏదైనా చాలు.....


నీ ప్రేమ భవంతి కో ఇటుక ...నీ విశాల నేత్రాలకి కాటుక,
నీ పంజరాన గువ్వ...కాలిలోన మువ్వ,
చేతిలోన పరుసు...మెడలోన గొలుసు ,
కొప్పులోన పువ్వు...పెదవిపైన నవ్వు ,
ఏదైనా ఓ క్షణమైనా చాలు.......

ఎలా....


చెలీ.....
ప్రతిక్షణం నీ ద్యాసేలా, నా కన్నుల్లో నీ రూపమేలా..
నీపై నాకింత ప్రేమేలా,గాలి తాకిడిలో నీ స్పర్శేలా..
నాలో నాకే మైకమేలా,నీడలో సైతం నీ చయేలా..
నీ కొరకై దిగులేలా,నీ పై ఇంత తపనేలా..
నా పెదవులపై అనుక్షణం నీ పేరేలా,అయ్యాను నేను నువ్వెలా..
నీ ప్రేమకై తపస్సేలా,నీవు కరుణించని జేవితమేలా...
వినయ్

నిన్నే


నే కోరుకున్నది నిన్నే కదా.. నా గుండె గోపురంలో నిండి వుంది నీ రూపే కదా
నే కన్నా కల నివే కదా ..నా ప్రతి స్పర్శలో నీ అలజడే కదా
నే ప్రతి పూట జపించేది నీ పేరే కదా .. నా ప్రతి శ్వాస నిన్ను తాకిన గాలే కదా
కన్నులు మూసినా నీ రూపమే కదా .. కనులు తెరిచిన నీ రూపమే కదా
అనుక్షణం నీ జ్ఞాపకమే కదా ...నా ఊపిరి నీ తోడే కదా ....

వినయ్

నిజమైన ప్రేమ ....

ఒకే ఆత్మా ఉంటుంది రెండు శరీరాలలో...
ఒకే పాట పలుకుతుంది రెండు హృదయాలలో...
ఒకేసారి దొరుకుతుంది ప్రతి జీవితంలో...
అది ఓడిపోదు, వాడిపోదు, కష్టసుఖాల్లో వీడిపోదు.......అదే నిజమైన ప్రేమ.
వినయ్

నీపై నా ప్రేమ.....

మల్లె పువ్వు నల్లగా పుయవచ్చును ......
మంచు కూడా వేడి సెగలు పుట్టించవచ్చును ......

పువ్వు బట్టి తేనె రుచే మారవచ్చును .........
ఇన్ని మారిన మారనిది నీపై నాకున్న ప్రేమని నీవు నమ్మవచ్చును.......



వినయ్

శిక్ష ....



ప్రతి తప్పుకి ఒక శిక్ష ఉంటే .....
నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్పైతే దానికి శిక్ష మరణమే ఐతే ...
మరణించే చివరి క్షనము కూడా నా మనసు నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది ...
ఎందుకో తెలుసా....మరణిస్తూ కూడా అది తలిచేది నిన్నే...
వినయ్

ఎలా....


మండుటెండల్లో దాహం ఎలాతీరుతుంది,దప్పికను తీర్చే పానీయం లభించేదాకా...

గుండెలోతుల్లో ఏముందో ఎలా తెలుస్తుంది,తలుపుతట్టే ఆత్మీయత లభించేదాకా...

నా మనసులో ఏముందో నీకు ఎలా తెలుస్తూంది ,నాలో సగభాగం అయేదాకా.....


వినయ్

తలపు...


నేను నిన్ను తలచిన ప్రతిసారీ ఒక పుష్పం వికసిస్తే,

ఆ తలపుల పూతోటలోనే సాగునేమో నా జీవితమంతా.......

వినయ్

ప్రేమంటే.....


రెండు తనవులు కానీ ఒకే ఆలోచన,రెండు హృదయాలు కానీ ఒకే చప్పుడు.......
వినయ్

నిజం....

కలలోను ,ప్రేమలోను ఆసాద్యమంటూ ఎదీ ఉండదు...........వినయ్

నీవుంటే .........

నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం
నువ్వు జంటై ఉంటే నా బ్రతుకులో సుఖమేగా నిత్యం...............

వినయ్

నీ ఊహల్లో....

క్షణ క్షణం నీ ఊహల్లో జీవించలేక ...
కరుగుతున్నాను ఒక వేలుగునై....
కాలుతున్నాను నీ ఊహలకీ కొవ్వత్తీ నై......
...వినయ్

నీవు దూరమైతే..........

చెలీ...
నువ్వు నా నుండి దూరమైన నీ జ్ఞాపకాలు మాత్రం దూరం కాలేదు ....
ప్రపంచానికి హద్దులు ఉన్నా నీమీద నాకున్న ప్రేమకు హద్దులు లేవు ....
నా కన్నులు నిన్ను మరచిన.. నా హృదయం నిన్ను మరువదు,
నా హృదయం నిన్ను మరచిన ..నా ప్రాణం ఇక మిగలదు..........
.........వినయ్

Tuesday, October 28, 2008

నీకై నీను...

చెలీ ...
ఎప్పుడూ చప్పుడూ కానీ నా కనురెప్పల్లో నువ్వే..
ఎప్పుడూ చప్పుడూ ఆపని నా గుండెచప్పుల్లో నువ్వే...
మాటకు మాటకు మధ్యన నా మౌనంలో నువ్వే...
మౌనం మౌనం మధ్యన నా మాటల్లో నువ్వే...
ఎప్పటికి నిన్ను మరువని న మనసులో నువ్వే..
నిన్ను మారిస్తే ఆగిపోయే నా హృదయంలో నువ్వే...
మొడై చూస్తున్నా...వాన చినుకై నువ్వు వస్తావని ..
నీ ప్రేమలో చేసింది నాకేదో కాలం...ఉంటావని నమ్ముతునాన్ను నాతోడుగా కలకాలం....

నీ జ్ఞాపకాలు....

నీ జ్ఞాపకాలు తరచి నన్ను తడుముతూ,
కన్నుల్లో నిదుర కరిగిపోయింది కలనైన నిన్నుకంచనివ్వక..
మౌనం నన్ను వీడనంది నీ ఆలోచనలు నన్ను చేరినాక ,
ఓదార్చు కోలేక నన్ను నేను మిగల్చలేక కథగా నిన్ను....

నీవు....

నీ కన్నుల నుండి నా కోసం జారే ఒక కన్నీటి చుక్క , నాలో తెలియని తుఫానులు సృష్టిస్తుంది,
నీ ఆలోచన నా కోసమే అని తెలిసిన క్షణం నా మనసు విశ్వం అవుంతుంది,
నన్ను వదిలి నువ్వు దాటిన తీరాల నుంచి తిరిగి చూసిన ఒక చూపు నన్ను పిచ్చేక్కిస్తుంది ...