Thursday, December 18, 2008

నిన్ను


రెండు కన్నులు ఉన్నా ప్రతిరోజూ నిన్ను చూడలేను...
రెండు చెవులు ఉన్నా ప్రతిరోజూ నీ మాట వినలేను...
కానీ ...ఉన్నా ఒక్క హృదయంలోనీ నీ గుర్తులు మాత్రం ఎప్పుడు మరువలేను.

Tuesday, November 25, 2008

ఆశా జీవి

పువ్వు రాలిందని కలవరపడకు, వచ్చే వసంతానికి స్వాగతం పలుకు ...
కాళరాత్రి చూసి కలతచెందకు,వచ్చే ప్రశాంత శుభోదయం కొరకు వేచి చూడు ...
జీవిత పాలసముద్రాన్ని ప్రేమతో చిలుకు,వచ్చే అమృతం కొరకు ఆశతో వేచి చూడు ...
కలతచేందే హృదయాలలో వెలుగు నింపు,కష్టాల్లో ఉన్నవారికి ఆనందాన్ని పంచు ...
శాశ్వతం కానీ జీవితంలో కక్షలను దరి రానీయకు,క్షణ కాలమైన ఇతరులకు ప్రేమను పంచు ...

Friday, November 7, 2008

నాకు వసంతం వస్తుంది

రాలిన నీ జ్ఞాపకాల ఆకుల్ని ఏరుకుంటాను.ఏరిన జ్ఞాపకాలు మంచు ముత్యాలై మనసును చల్లబరుస్తుంటాయి.చల్లబడిన మనసుకు ఎటుచూసినా వెన్నెల కాసినట్టు నువ్వే కనబడతావు.అలా భ్రమల జడివానలో తడిచి ముద్దవుతుంటాను.నీ కోసం వేచి చూసే నా వేడి నిట్టూర్పుల సెగల్లో మాడుతుంటాను.కొన్ని క్షణాల్లోనే శిశిర, హేమంత, శరద్, వర్ష, గ్రీష్మాలన్నీ చూస్తాను ...వసంతంలా నువ్వు వస్తావని.

ఏ జన్మకైనా

పూచీ పూయని పున్నమీలో ...ఎద దోచి , తోడువై పిలిచావు,
గుండెలు రగిలే ఎండలో ... నా నీడవు నీవై నిలిచావు,
కాంతులు విరిసే నీ కన్నులులోన .. నా కలలుండాలి ఏ జన్మకైనా !

Thursday, November 6, 2008

ఆశ...

కలలలో,మధువనులలో..నీ పిలుపు విన్నానులే
మనసులో ప్రతి మలుపులో..నిను మలచుకునాన్నులే..

వేచివున్న నాకు తెలుసు.. విరహమెంత తీయనిదో..
కాచుకున్న నీకు తెలుసు.. కలయికెంత కమ్మనిదో !!

అల్లరి చేసే ఆశలు నాలో..విరహం రేపెను..
తొలకరి వయసు,గడసరి మనసు.. నీ జత కోరెను !!


వినయ్

Wednesday, November 5, 2008

కాదు....

జోలపాడి బుజ్జగించడానికి నీవు నా చంటిపాపవి కాదు,
నా కంటిలో కన్నీరు తెలుసుకోవడానికి నీవు నా కంటి రెప్పవి కాదు,
నా మనస్సు తెలుసుకోవడానికి నీవు నా సగభాగం కాదు,
ఇన్ని కానీ నిన్ను మరువడానికి నేను శిలను కాదు....



వినయ్

ఒక అనువాద కవిత

మట్టి ముద్దను పాత్రగా మలచుదాని శూన్యతలోనేదాని ఉపయోగం ఉంటుంది.
గుమ్మాలు, కిటికీలతోగృహాన్ని నిర్మించుదాని శూన్యతలోనేదాని ఉపయోగం ఉంటుంది.
దేన్నో పొందుతూ ఉంటాం కానీదాని శూన్యతనే వాడుకుంటూ ఉంటాం.



మూలం: టావో టె షింగ్ (Mould Clay into a vessel).

అబద్దం

నన్ను నేను మోసం చేసుకుంటూ నిన్ను నేను మోసం చేస్తూ,
నీవు నన్ను మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ...

నా కోసం నువ్వు అబద్దాలాడుతూ, నీ కోసం నేను అబద్దాలాడుతూ

బలే సాగుతున్నా మన ఈ ప్రయాణంలో తరువాతి మజిలీ ఏమిటో మరి...



నాకు ఇష్టమైన పాట


అలివేణీ ఆణిముత్యమా... నీ కంట నీతిముత్యమా
ఆవిరి చిగురో... ఇది ఊపిరి క్యబురూ

స్వాతివాన లేత ఎండలో... జాలినవ్వు జాజిదండలో
అలివేణీ ఆణిముత్యమా... నా పరువాల ప్రానముత్యమా
జాబిలీ చలువో...
ఇది వెన్నెల కొలువో స్వాతివాన లేత ఎండలో...
జాజిమల్లి పూలగుండెలో
అలివేణీ ఆణిముత్యమా...
కుదురైన బొమ్మకి... కులుకు మల్లెరెమ్మకి కుదురైన బొమ్మకి...
కులుకు మల్లెరెమ్మకి నుదుట ముద్దు పెట్టనా... బొట్టుగావద్దంటే ఒట్టుగా!
అందాల అమ్మకి... కుందనాల కొమ్మకి

అందాల అమ్మకి...
కుందనాల కొమ్మకి అడుగుమడుగులోత్తనా... మెత్తగాఅవునంటే తప్పుగా!
అలివేణీ ఆణిముత్యమా... నా పరువాల ప్రాణముత్యమా
పొగడలేని ప్రేమకి... పొన్నచెట్టు నీడకిపొగడలేని ప్రేమకి...
పొన్నచెట్టు నీదకి పొగదదన్దలల్లుకోనా ... పూజగాపులకింతల పూజగా!
తొలిజన్మల నోముకి... దొరనవ్వుల సామికితొలిజన్మల నోముకి...
దొరనవ్వుల సామికిచెలిమై నేనుండిపోనా... చల్లగామరుమల్లెలు చల్లగా!
అలివేణీ ఆణిముత్యమా... నీ కంట నీటిముత్యమాజాబిలి చలువో...

ఇది వెన్నెల కొలువోస్వాతివాన లేత ఎండలో... జాజిమల్లి పూలగున్దెలో
అలివేనీ ఆణిముత్యమా...అలివేణీ ఆణిముత్యమా...

***

చిత్రం : ముద్దమందారం
సంగిఇతం : రమేష్ నాయుడు
గానం : S P బాలసుబ్రమణ్యం, S జానకి
గీత రచన : వేటూరి

నాకు ఇష్టమైన పాట...


ఏ తీగ పువ్వునొ ఏ కొమ్మ తేటినొ కలిపింది ఏ వింత అనుబంధమవునో--
అప్పుడెన్న?-- అర్థం కాలేదా?
ఏ తీగ పువ్వునొ ఏ కొమ్మ తేటినొ కలిపింది ఏ వింత అనుబంధమవునోతెలిసీ తెలియని అభిమానమవునో
మనసు మూగది మాటలు రానిదిమమత ఒకటే అది నేర్చినది--
ఆహ అప్పుడియా--
పెద్ద అర్థమైనట్టు భాష లేనిది బంధమున్నదిమన ఇద్దరినీ జత కూర్చినదిమన ఇద్దరినీ జత కూర్చినది
వయసే వయసును పలకరించిందివలదన్నా అది నిలువకున్నది--
ఏ నీ రొంబ అళ్ళారికె-- ఆహ్ రొంబ? అంటే?
ఎల్లలు ఏవీ ఒల్లనన్నదినీదీ నాదొక లొకమన్నదినీదీ నాదొక లొకమన్నది
తొలిచూపే నను నిలవేసినదిమరుమాపై అది కలవరించినది-- నల్ల పొన్ను అంటే నల్ల పిల్లామొదటి కలయికే ముడి వేసినదితుది దాకా ఇది నిలకడైనదితుది దాకా ఇది నిలకడైనది
***
చిత్రం : మరో చరిత్ర

గానం : P సుశీల, కమల్ హాసన్
సంగిఇతం : M S విశ్వనాథన్
రచన : ఆత్రేయ

Tuesday, November 4, 2008

చెలీ

చెలీ...

నీవు నా తోడుంటే జయీస్తాను ఈ విశ్వంనే ...

వినయ్

పుష్పం

చెలీ
నీవు పుష్పం అయితే నేను నీ ప్రేమ ఒడిలో ఒదిగి పోతాను ఇలా....

వినయ్

Saturday, November 1, 2008

ప్రియా...

ఓ ప్రియా...
నీ కొంటె చూపే రేపింది కలలెన్నో నాలో, నీ చిరునవ్వుతో కలుపుకోన్నావు నన్నే నీలో...
కను రెప్ప మూస్తే చెదిరి పోవునేమో అని నీ రూపం ,చేశాను కనులకే నిదురను దూరం...
తొలిచూపులోనే నా మదిలో అలజడి రేపినావు.ఆనాటి నుండి నా మదిలో నీవే కొలువున్నావు
గడిపాను మరువలేని మధుర క్షనలెన్నొ చూస్తూనే నిన్ను,నీవు లేని క్షనలే అయ్యాయి యుగాలు నాకు..

వినయ్

Thursday, October 30, 2008

ఏదీ లేదు

మదిలోని మంచితనానికి మరణం లేదు,
ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు,
అనుక్షణం నిన్ను తలచే మనస్సుకు అలసట లేదు,
నిన్ను తోడుగా పొందని నా జీవిత పయనం లేదు,
నీవు నేనుగా లేని నా ప్రపంచమే లేదు

వినయ్

Wednesday, October 29, 2008

ఏదైనా చాలు.....


నీ ప్రేమ భవంతి కో ఇటుక ...నీ విశాల నేత్రాలకి కాటుక,
నీ పంజరాన గువ్వ...కాలిలోన మువ్వ,
చేతిలోన పరుసు...మెడలోన గొలుసు ,
కొప్పులోన పువ్వు...పెదవిపైన నవ్వు ,
ఏదైనా ఓ క్షణమైనా చాలు.......