Wednesday, November 5, 2008

నాకు ఇష్టమైన పాట


అలివేణీ ఆణిముత్యమా... నీ కంట నీతిముత్యమా
ఆవిరి చిగురో... ఇది ఊపిరి క్యబురూ

స్వాతివాన లేత ఎండలో... జాలినవ్వు జాజిదండలో
అలివేణీ ఆణిముత్యమా... నా పరువాల ప్రానముత్యమా
జాబిలీ చలువో...
ఇది వెన్నెల కొలువో స్వాతివాన లేత ఎండలో...
జాజిమల్లి పూలగుండెలో
అలివేణీ ఆణిముత్యమా...
కుదురైన బొమ్మకి... కులుకు మల్లెరెమ్మకి కుదురైన బొమ్మకి...
కులుకు మల్లెరెమ్మకి నుదుట ముద్దు పెట్టనా... బొట్టుగావద్దంటే ఒట్టుగా!
అందాల అమ్మకి... కుందనాల కొమ్మకి

అందాల అమ్మకి...
కుందనాల కొమ్మకి అడుగుమడుగులోత్తనా... మెత్తగాఅవునంటే తప్పుగా!
అలివేణీ ఆణిముత్యమా... నా పరువాల ప్రాణముత్యమా
పొగడలేని ప్రేమకి... పొన్నచెట్టు నీడకిపొగడలేని ప్రేమకి...
పొన్నచెట్టు నీదకి పొగదదన్దలల్లుకోనా ... పూజగాపులకింతల పూజగా!
తొలిజన్మల నోముకి... దొరనవ్వుల సామికితొలిజన్మల నోముకి...
దొరనవ్వుల సామికిచెలిమై నేనుండిపోనా... చల్లగామరుమల్లెలు చల్లగా!
అలివేణీ ఆణిముత్యమా... నీ కంట నీటిముత్యమాజాబిలి చలువో...

ఇది వెన్నెల కొలువోస్వాతివాన లేత ఎండలో... జాజిమల్లి పూలగున్దెలో
అలివేనీ ఆణిముత్యమా...అలివేణీ ఆణిముత్యమా...

***

చిత్రం : ముద్దమందారం
సంగిఇతం : రమేష్ నాయుడు
గానం : S P బాలసుబ్రమణ్యం, S జానకి
గీత రచన : వేటూరి

1 comment:

విరజాజి said...

హాస్యానికి చక్రవర్తి అయిన జంధ్యాల గారి సినిమాలన్నిటిలోనూ పాటలన్నీ మంచి సాహితీ విలువలతోనూ, తెలుగు తనపు గుబాళింపులతోనూ ఉంటాయి.. సంభాషణల చక్కిలిగింతలే కాదు, సాహితీ సుగంధపు మైమరపులు కూడా ఉంటాయి. మచ్చుకు నాలుగుస్థంభాలాట చిత్రం లో "చినుకులా రాలి..." పాట మనం మరిచిపోలేని మధుర గీతం. అలాగే ఈ పాట కూడా. ఈ సినిమాలో మరో మంచి పాట... "ముద్దుకే ముద్దొచ్చే మందారం". ఆణి ముత్యం లాటి మంచి పాటను గుర్తుచేసారు. ధన్యవాదాలు.