Friday, November 7, 2008

నాకు వసంతం వస్తుంది

రాలిన నీ జ్ఞాపకాల ఆకుల్ని ఏరుకుంటాను.ఏరిన జ్ఞాపకాలు మంచు ముత్యాలై మనసును చల్లబరుస్తుంటాయి.చల్లబడిన మనసుకు ఎటుచూసినా వెన్నెల కాసినట్టు నువ్వే కనబడతావు.అలా భ్రమల జడివానలో తడిచి ముద్దవుతుంటాను.నీ కోసం వేచి చూసే నా వేడి నిట్టూర్పుల సెగల్లో మాడుతుంటాను.కొన్ని క్షణాల్లోనే శిశిర, హేమంత, శరద్, వర్ష, గ్రీష్మాలన్నీ చూస్తాను ...వసంతంలా నువ్వు వస్తావని.

1 comment:

Unknown said...

heart touching quotes.
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our new channel